ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రం షాక్ ఇచ్చింది.ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు అనుమతి ఇచ్చింది.ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది.అయితే ముందుగా అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గత సంవత్సరం నవంబర్‌లో ఆదేశించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను అనుమతి కోరింది.ఈడీ అభ్యర్థనకు ఎల్జీ ఆమోదం తెలిపారు.దీనితో ఈ విషయాన్ని ఈడీ అధికారులు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లగా…కేజ్రీని విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కేజ్రీవాల్‌తో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేత,ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా విచారించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది.
Previous Articleకాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్టు…!