రాష్ట్ర ప్రజలందరికి ఏపీ సీఎం చంద్రబాబు కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కాలం మరినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. కుటుంబమంతా పలు అభివృద్ధి, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానికులతో మమేకమవుతూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
Previous Article‘మిషన్ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
Next Article కేజ్రీవాల్ కు ఈడి షాక్….!