భారత వాతావరణశాఖ (ఐఎండీ) 150 ఏళ్ల వేడుక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ‘మిషన్ మౌసం’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి వాతావరణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎండీ విజన్-2047 పత్రాన్ని, స్మారక నాణేన్ని విడుదల చేశారు.
పర్యావరణ మార్పుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్స్ కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్ మౌసం’ ను ప్రారంభించినట్లు తెలిపారు.
వాతావరణ ప్రక్రియపై అవగాహన పెంపొందించడం, నిర్వహణ, ఎయిర్ క్వాలిటీ డేటాను అందించడంపై మిషన్ మౌసం దృష్టిసారిస్తుందని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో విపత్తు సమయాలలో వాటికి ఆపన్నహస్తం అందించడంలో భారత్ ముందుంటుందని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు