అభిశంసనకు గురైన సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.తీవ్ర ప్రతి ఘటనల అనంతరం యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనితో దక్షిణ కొరియా చరిత్రలో అరెస్టయిన మొదటి అధ్యక్షుడిగా యోల్ నిలిచారు.అయితే బుధవారం తెల్లవారుజామున సియోల్‌లోని అధ్యక్ష భవనం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో యోల్‌ను అరెస్టు చేసేందుకు 3 వేల మందికిపైగా పోలీసులతో యాంటీ కరెప్షన్ ఇన్వెస్టిగేటర్లు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు.అయితే వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు,యోల్ మద్దతుదారులు,వ్యక్తిగత సిబ్బంది,సైన్యం పోలీసులతోపాటు విచారణ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కాగా తీవ్ర ప్రతిఘటనల నడుమ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన అధికారులు యోల్‌ను అరెస్టు చేశారు.ఓ ఎరుపు రంగు బస్సులో ఆయనను అక్కడి నుంచి తరలించారు.ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.అయితే యోల్‌ను గవాచియాన్‌లోని కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కార్యాలయానికి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.అక్కడే మార్షల్ లా విధింపు కేసులో విచారణ జరుపనున్నారని తెలుస్తోంది.అరెస్టు వారెంట్ మేరకు 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది.