భారత క్రికెట్ కు దాదాపు రెండు దశాబ్దాలకు చేరువగా సేవలందిస్తూ ప్రపంచ క్రికెట్ లోనే మేటి బ్యాటర్లుగా పేరున్న క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తిరిగి ఫామ్ అందుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో ఆడడం మంచిదని పలువురు భావిస్తున్నారు. మాజీ భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ఇదే సలహా ఇచ్చాడు. ప్రతి ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. ఫామ్ లో లేకపోతే గాయపడకుండా ఉంటే కచ్చితంగా దేశవాళీలో ఆడాలి. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇదెంతో ముఖ్యమని యువరాజ్ అన్నాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన సిడ్నీటెస్టులో ఆడకూడదని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని ఈ యువీ సమర్థించాడు. అలాగే రోహిత్ కెప్టెన్సీ లో భారత్ అందుకున్న ఘనతలను ప్రస్తావించాడు. రోహిత్ సారథ్యంలో టీ20ప్రపంచకప్ గెలిచింది. వన్డే ప్రపంచకప్లో ఫైనల్ చేరింది. అలాంటి ఆటగాడు మరొక ఆటగాడికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో ఆఖరి టెస్టు నుంచితప్పుకుంటే తప్పేంటి? అని అన్నాడు. ఎంతమంది కెప్టెన్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించాడు.
Previous Article‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ సాంగ్ రిలీజ్
Next Article ‘గేమ్ ఛేంజర్’ పైరసీ ప్రదర్శన…నిందితుల అరెస్టు