ఈరోజు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మొబిలిటీ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలు మరియు అభివృద్ధిని చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని ఇది ప్రజల పెరుగుతున్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సజావైన ప్రయాణ అనుభవాలను సృష్టించడం మరియు ఆటో మొబైల్ పరిశ్రమకు కొత్త అవకాశాలకు మార్గాలు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మేకిన్ ఇండియా చొరవ, PLI స్కీమ్ల మద్దతుతో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ని ప్రారంభించిన ప్రధాని మోడీ
By admin1 Min Read