ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్- చిరాగ్ సెమీస్ లోకి అడుగుపెట్టింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో భారత జోడీ 21-10, 21-17 తేడాతో కొరియాకు చెందిన జిన్- మిన్ పై విజయం సాధించింది. తొలి గేమ్ లో విరామానికి 11-3తో నిలిచిన ఈ జోడీ అదే జోరులో నెగ్గింది. రెండో గేమ్ 16-16తో సమంగా ఉన్న దశలో సాత్విక్ జోడీ అద్భుతమైన ఆటతీరుతో గెలుపు కైవసం చేసుకుంది. మరోవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ఆమె 9-21, 21-19, 17- 21 తేడాతో ఇండోనేసియాకు చెందిన పారిస్ కాంస్య విజేత మరిస్కా తుంజుంగ్ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో కిరణ్ జార్జ్ 13-21, 19-21తో చైనాకు చెందిన యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు.
Previous Articleమలేషియా వేదికగా నేటి నుండి అండర్-19 టీ20 ప్రపంచకప్
Next Article విశ్వక్ సేన్ “లైలా” టీజర్ విడుదల…!