మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు . ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు . ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని తెలుగు వాడి ఆత్మ గౌరవం, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.. బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యమని పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ సంక్షేమానికి అర్ధం తెచ్చారు. అభివృద్ధి అంటే చేసి చూపించారు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులు అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్. బీసీలకు మొట్టమొదటిసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. గత 5 ఏళ్ళు కడపలో ఏమి జరిగిందో చూసారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కడపను మా ప్రభుత్వం అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తుందో చూస్తారు. ఈ సారి ఉమ్మడి కడప జిల్లాలో 10 కి 10 గెలవాలి. 2 ఎంపీ సీట్లు గెలవాలి. అప్పుడే అభివృద్ధి ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. నీటి నిర్వహణ సరిగ్గా చేసాం కాబట్టే, ఈ ఏడాది రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బ్రతికే రోజులు తీసుకొస్తామని చెప్పారు. పోలవరం నుండి 200-300 TMC నీరు సీమకు తీసుకుని వస్తే, రాయలసీమకు ఇక తిరుగు ఉండదు. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదాట్లో ముంచేసింది. ఈ రోజే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం మొదలు పెట్టాం. పోలవరాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించినట్లు తెలిపారు. ఇటీవల టీడీపీ సభ్యత్వం కోటికి చేరుకోవడం పై స్పందిస్తూ జనరల్ సెక్రటరీగా నారా లోకేష్, కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పీట వేసారు. రూ.130 కోట్లు కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. కోటి మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని వివరించారు. మరోవైపు ఈ నెలాఖరులోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు. ప్రజల ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నాం. రాజధాని అమరావతి పోలవరానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. విశాఖ రైల్వే జోన్ విశాఖ ఉక్కుకు రూ. 11,440 కోట్లు ఇచ్చి కేంద్రం ఆదుకుందని పేర్కొన్నారు. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం వల్లే సాధ్యమవుతున్నాయి. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు