ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేడు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న, పాకిస్థాన్ తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్ మార్చి 2న భారత్ దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీ కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా 2013లో ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్డీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్షదీప్ సింగ్.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు