దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ హాస్పిటల్ డాక్టర్ పై హత్యాచారం కేసులో కోల్ కతా లోని సీల్దా కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది. అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనుంది. సీబీఐ సమర్పించిన ఆధారాల మేరకు సంజయ్ ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు నేపథ్యంలో భారీ భద్రత మధ్య సంజయ్ ను కోర్టుకు తీసుకువచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనను తప్పుడు కేసులో ఇరికించారని ఈ సందర్భంగా జడ్జికి సంజయ్ తెలిపాడు. అతనికి 20న మాట్లాడే అవకాశం ఇస్తామని జడ్జి తెలిపారు. ఈ తీర్పును తాను గౌరవిస్తున్నట్లు మృతురాలి తండ్రి కోర్టులో భావోద్వేగానికి గురయ్యారు. 2024 ఆగస్టు 9న రాత్రి ఆర్జీకర్ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్ కతా పోలీసుల నుండి సీబీఐ తీసుకుని విచారిస్తోంది. హాస్పిటల్ ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు
By admin1 Min Read