కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కోల్ కత్తా లోని స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చింది.ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ..తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని కోర్టుకు తెలిపాడు. ఈ నేరం తాను చేయలేదని చెప్పాడు.ఈ నేరానికి పాల్పడిన వారిలో ఒక పోలీస్ అధికారి హస్తం కూడా ఉన్నట్లు కోర్టుకు వెల్లడించాడు.నన్ను తప్పుగా ఇరికించారు.నేను ఈ నేరం చేయలేదు.హత్యాచారం చేసిన వారిని వదిలివేస్తున్నారు.ఇందులో ఒక ఐపీఎస్ కూడా ఉన్నారు’ అని కోర్టుకు చెప్పాడు.సీల్దాలోని సీబీఐ కోర్టు ఈ కేసుపై తాజాగా తీర్పు ఇచ్చింది.సీసీటీవీ ఫుటేజ్, సీబీఐ సాక్ష్యాల ఆధారంగా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా సీల్దా కోర్టు నిర్ధారించింది.సోమవారం శిక్షలు ఖరారు చేస్తామని ప్రకటించింది.అయితే ఆ రోజు కేసు విచారణ సందర్భంగా మాట్లాడేందుకు నిందితుడికి అనుమతిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
Previous Articleదేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ కేసులో సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు
Next Article కేజ్రీవాల్ పై దాడి…బీజేపీ పనేనని ఆప్ ఆరోపణ