సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలా క్షమాపణలు చెప్పారు.సైఫ్‌పై దాడి గురించి తాను మాట్లాడే సమయంలో తాను ప్రవర్తించిన తీరు సరైందని కాదని ఆమె అన్నారు.అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు.డియర్ సైఫ్ అలీ ఖాన్ సర్.. మీకు క్షమాపణలు చెబుతూ పంచుకుంటున్న ఈ పోస్ట్ చేరుతుందని ఆశిస్తున్నాను.ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతున్న సమయంలో నేను వ్యవహరించిన తీరుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్న సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు తెలియదు.డాకు మహారాజ్ విజయం వల్ల వచ్చిన సంతోషంలో నేను ఉన్నాను.ఆ సక్సెస్ వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను.మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది. మీపై గౌరవంతో..’’ అని పేర్కొన్నారు. ‘డాకు మహారాజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా సైఫ్ అలీఖాన్ దాడిపై ఆమెను విలేకరి ప్రశ్నించగా ఇది చాలా విచారకరం అని బదులిచ్చారు.తన చేతికి ఉన్న వ్రజపు ఉంగరాన్ని చూపుతూ ఆమె సమాధానం చెప్పడం విమర్శలకు దారి తీసింది.ఈ క్రమంలోనే ఆమె సారీ చెప్పారు.
Previous Articleసైఫ్ పై దాడి…అండర్ వరల్డ్ తో సంబంధం లేదు: మంత్రి
Next Article కుటుంబ వివాదం…మనోజ్‌కు నోటీసులు