గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ఏర్పాటు చేసిన గిరిజన – ఆదివాసి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. గిరిజనులు, ఆదివాసీలు అంటే తనకు ప్రత్యేకమైన గౌరవమని పేర్కొన్నారు. తాము జీవించటంతో పాటు, ప్రకృతిని కాపాడుకోవడానికి కట్టుబడిన వారి సంస్కృతి మహోన్నతమైనదని కొనియాడారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్ టి వర్గాలకు ఎన్నో అవకాశాలను అందిస్తోందని వాటిని గిరిజన సోదరులు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన సోదరులందరితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని గిరిజన-ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే లక్ష్యంతో, గిరిజనుల ఆత్మ గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఇతర నిర్వాహకులకు ఈసందర్భంగా అభినందనలు తెలిపారు.
గిరిజనుల అభివృద్ధి కోసం ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల మీద దృష్టి పెట్టాలి
By admin1 Min Read
Previous Articleమహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం.. భక్తులు కంగారు
Next Article ఖోఖో ప్రపంచకప్ లో చరిత్ర సృష్టించిన భారత్