చైనాలో ఇటీవల ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి 35 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడికి మరణశిక్ష పడగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడికి శిక్ష అమలు చేశారు. మరో కేసులో ఓ యువకుడికీ ఇదే విధంగా మరణశిక్ష అమలు చేసినట్లు చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది.చైనాకు చెందిన ఫాన్ వీకియూ (62) అనే వ్యక్తి గతేడాది నవంబర్ 11న ఝుహాయ్ నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయట నిర్లక్ష్యంగా కారు నడిపారు. అక్కడ వ్యాయామం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన ఘటనలో 35 మంది మరణించగా..మరో 43 మంది గాయపడ్డారు. అనంతరం కారులో తనను తాను కత్తితో పొడుచుకుని ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు.కోమాలోకి వెళ్లిన అతడిని ఆసుపత్రిలో చేర్చారు.ఇటీవలే విడాకులు తీసుకున్నాడని, భార్యతో జరిగిన ఆస్తి పంపకంలో అసంతృప్తికి గురవడంతోనే అతడు ఈ ఘోరానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది.
చైనాలో నిర్లక్ష్యంగా కారు నడిపి 35 మంది మృతికి కారణమైన ఘటనలో నిందితుడికి మరణశిక్ష
By admin1 Min Read