అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ ప్రత్యేకమైన బటన్‌ను ఏర్పాటుచేసుకున్నారు.అదే డైట్ కోక్ బటన్.ట్రంప్ శీతలపానీయం కోకాకోలా ప్రియుడు.ఆయన రోజుకు 12 డైట్ కోక్‌లను అలవోకగా తాగడం అలవాటు అని ఈ విషయాన్ని గతంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.అయితే 2016లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో ఈ బటన్‌ను ఏర్పాటుచేశారు.ఆయనకు అవసరమైనప్పుడు దానిని నొక్కితే…డైట్ కోక్ తెచ్చి ఇచ్చేవారు.అయితే 2021 ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ బటన్‌ను అక్కడినుంచి తొలగించారు.
ఈనేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్..తన కోక్ బటన్‌ను తిరిగి ఏర్పాటుచేయించుకున్నారు.నేను దానిని నొక్కిన ప్రతిసారీ అందరూ కొంచెం భయపడతారు’ అని ట్రంప్ గతంలో జోక్ చేశారు.వాస్తవానికి ట్రంప్ మంచినీళ్లు తాగడం ఎప్పుడూ చూడలేదని యూఎఫ్‌సీ సీఈవో డానా వైట్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇటీవల కాలంలో ట్రంప్ రెగ్యులర్ కోక్ కూడా తాగుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అధ్యక్షుడి అభిరుచికి తగినట్లుగా వైట్‌హౌస్, ప్రభుత్వ కార్యాలయాలను అలంకరిస్తారు. ఈక్రమంలోనే ఓవల్ కార్యాలయాన్ని ట్రంప్ అభిరుచికి తగినట్లుగా తీర్చిదిద్దారు.