కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. హంపీకి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు