కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. వాస్తవమైన అభివృద్ధి అంటే అందరికీ సమాన అవకాశాలు, అభివృద్ధి లభించడమన్నారు. అప్పుడే దేశం ముందుకు సాగుతుందన్నారు. ప్రజలందరి రక్తం, చెమట వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చక్రాలు తిరుగుతున్నాయి, కానీ అందులో అందరికీ న్యాయమైన వాటా లభిస్తుందా? ఆలోచించండి అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తప్పుడు విధానాల కారణంగా వ్యవసాయరంగంలో రైతులు, రైతుకూలీల పరిస్థితులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రమాదకరమైన జీఎస్టీ, ఐటీ విధానాలు పేద, మధ్యతరగతి బతుకులపై భారం మోపుతున్నాయని మరోవైపు.. ప్రభుత్వం కార్పొరేటు రుణాలను మాఫీ చేసుకొంటూ పోతోందని దుయ్యబట్టారు. ఆకాశాన్నంటిన ధరలతో ఇపుడు పేదలు మాత్రమే కాదు, వేతన జీవులు కూడా అవసరాలకు రుణాలు తీసుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవమైన అభివృద్ధి అంటే అందరికీ సమాన అవకాశాలు, ప్రగతి లభించడమే: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
By admin1 Min Read