చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో నటి ప్రియాంకా చోప్రా సందడి చేశారు.ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రదక్షణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రియాంకా చోప్రాను పూజారులు శేష వస్త్రంతో గౌరవించారు. ఈ టెంపుల్ విజిట్‌కు సంబంధించిన ఫొటోలను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆమె షేర్ చేశారు. ఆలయ ఆవరణలో తను ఉన్న ఫొటోలను, వీడియోలను షేర్ చేసిన ప్రియాంకా చోప్రా..శ్రీ బాలాజీ ఆశీస్సులతో కొత్త అధ్యాయం మొదలైంది.మనమందరం మన హృదయాల్లో శాంతిని నింపుకొని, మన చుట్టూ సమృద్ధి, సౌభాగ్యాలతో గడపాలి.దేవుడి దయ అనంతం. ఓం నమో నారాయణాయథ్యాంక్యూ ఉపాసన కొణిదెల” అని పేర్కొన్నారు.ప్రియాంకా చోప్రా పోస్ట్‌కు మెగా కోడలు ఉపాసన కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘మీ నూతన సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి’’ అని కామెంట్ చేశారు. ఉపాసన చేసిన ఈ కామెంట్‌తో రాజమౌళి-మహేష్ కాంబో ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ప్రియాంకా చోప్రానే అనేది తెలిసిపోయిందంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
Previous Articleవాస్తవమైన అభివృద్ధి అంటే అందరికీ సమాన అవకాశాలు, ప్రగతి లభించడమే: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
Next Article మమతా బెనర్జీ తొందరపడొద్దు: ఆర్జీ కర్ మృతురాలి తండ్రి