ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లకు హామీలను ప్రకటిస్తూ తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ రెండు భాగాలుగా తమ మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ను విడుదల చేసింది. ఆ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజీవాల్ దీన్ని విడుదల చేశారు. భారత్ లోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారు. ట్యాక్స్ లకు వారు బాధితులగా మారిపోయి అధికంగా ట్యాక్స్ లు చెల్లిస్తున్నారు. ప్రతిఫలంగా తక్కువ ప్రయోజనాలు మాత్రమే పొందుతున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ట్యాక్స్ చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కానీ, వాటిని పలువురు ఉచితాలంటూ విమర్శిస్తున్నారని ‘విదేశాల్లో ఇలాంటి పథకాలు అమలు చేస్తే.. మనం మెచ్చుకుంటాం. అదే మన దేశంలో చేస్తే.. ఉచితాలని ముద్ర వేస్తామని ఆక్షేపించారు . ప్రజల సొమ్మును వారి ప్రయోజనాలకు వినియోగిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఆప్ పార్టీ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లు
1. ఎడ్యుకేషన్ కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ ను 2 శాతం నుండి 10 శాతానికి పెంచడం. ప్రైవేటు స్కూల్స్ లో ఫీజులను నియంత్రించడం.
2. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా హైయర్ ఎడ్యుకేషన్ కు రాయితీలు
3. హెల్త్ బడ్జెట్ ను 10 శాతానికి పెంచడం. హెల్త్ పాలసీ పై ట్యాక్స్ తీసేయడం
4. ఇన్ కం టాక్స్ మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10లక్షలకు పెంపు.
5. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు
6. సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టడం
7. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించడం
మధ్యతరగతి కోసం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’: మిడిల్ క్లాస్ మ్యానిఫెస్టో
By admin2 Mins Read

