బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల జరిగిన దాడిపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ బుధవారం నాడు పలు ప్రశ్నలను లేవనెత్తారు.దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అత్యంత వేగంగా రికవరీ అవ్వడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.ఈనెల 16న బాంద్రాలోని తన నివాసంలో ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్… లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఐదు రోజుల తర్వాత మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు.ఆసుపత్రి నుండి బాంద్రాలోని తన నివాసం ‘సద్గురు శరణ్’ అపార్ట్ మెంట్స్ కు చేరుకున్నారు.ఆ సమయంలో ఆయన హుషారుగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇదే విషయమై సంజయ్ నిరుపమ్.. సర్జరీ తర్వాత సైఫ్‌కు అంత ఫిట్నెస్ ఎక్కడిదంటూ అనుమానం వ్యక్తం చేశారు.ఆయనకు ఆరు కత్తిగాట్లు, 3 లోతైన గాయాలయ్యాయి. 2.5 అంగుళాల కత్తి అతనికి గుచ్చుకుంది. అతనికి డాక్టర్లు సర్జరీ చేశారు. కానీ ఐదు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సైఫ్… ఏమీ పట్టనట్లు హుషారుగా నడుస్తూ కనిపించాడు.ఇంత త్వరగా కోలుకోవడం సాధ్యమేనా?” అని సంజయ్ నిరుపమ్ ‘ఇండియా టుడే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సర్జరీ తర్వాత సైఫ్‌కు అంత ఫిట్నెస్ ఎక్కడిది?… – శివసేన నేత సంజయ్ నిరుపమ్
By admin1 Min Read
Previous Articleఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మందుపాతరలు నిర్వీర్యం..
Next Article ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్…!

