భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటయింది.జాస్ బట్లర్ 68 (44; 8×4, 2×6) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హార్థిక్ పాండ్య, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. అనంతరం భారత్ 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.సంజూ శాంసన్ 26 (20; 4×4, 1×6)బ్యాట్ ఝళిపించాడు. అభిషేక్ శర్మ 79 (34; 5×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. దీంతో భారత్ సునాయాసంగా విజయం అందుకుని సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, అదిల్ రషీద్ ఒక వికెట్ తీశారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్:
సాల్ట్ 0(3) (సి) సంజూ శాంసన్ (బి) అర్ష్ దీప్ సింగ్
బెన్ డకెట్ 4 (4;1×4) (సి) రింకూ సింగ్ (బి) అర్ష్ దీప్ సింగ్
హారీ బ్రూక్ 17 (14; 2×4, 1×6) (బి) వరుణ్ చక్రవర్తి
జాస్ బట్లర్ 68 (44; 8×4, 2×6) (సి) నితీష్ కుమార్ రెడ్డి (బి) వరుణ్ చక్రవర్తి
లివింగ్ స్టోన్ 0(2) (బి) వరుణ్ చక్రవర్తి
జాకోబ్ బెతెల్ 7(14) (సి) అభిషేక్ శర్మ (బి) హార్థిక్ పాండ్య
జామీ ఓవర్టన్ 2 (4) (సి) నితీష్ కుమార్ రెడ్డి (బి) అక్షర్ పటేల్
గస్ అట్కిన్ సన్ 2 (13) (స్టంపింగ్) సంజూ శాంసన్ (బి) అక్షర్ పటేల్
జోఫ్రా ఆర్చర్ 12 (10; 1×4) (సి) సూర్య కుమార్ యాదవ్ (బి) హార్థిక్ పాండ్య
అదిల్ రషీద్ 8 నాటౌట్ (11; 1×4)
మార్క్ వుడ్ 1(రనౌట్) సంజూ శాంసన్.
అదనపు పరుగులు:11 మొత్తం:132-10 (20 ఓవర్లు).
భారత్ ఇన్నింగ్స్:
సంజూ శాంసన్ 26 (20;4×4, 1×6) (సి) గస్ అట్కిసన్ (బి) జోఫ్రా ఆర్చర్
అభిషేక్ శర్మ 79 (34; 5×4, 8×6) (సి) హారీ బ్రూక్ (బి) అదిల్ రషీద్
సూర్య కుమార్ యాదవ్ 0(3) (సి) సాల్ట్ (బి) జోఫ్రా ఆర్చర్
తిలక్ వర్మ 19 నాటౌట్ (16; 3×4).
హార్థిక్ పాండ్య 3 నాటౌట్ (4)
అదనపు పరుగులు:6 మొత్తం:133-3 (12.5ఓవర్లలో).
అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ :మొదటి టీ20లో ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం:
By admin2 Mins Read
Previous Articleఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అడిషనల్ జడ్జిల నియామకం
Next Article ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో సింధు ఓటమి