జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకుంటున్న మిస్టరీ మరణాలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ మరణాలకు అంటువ్యాధి కారణం కాదని వెల్లడించారు. ‘‘ఈ మరణాలకు బ్యాక్టీరియా, వైరస్ కారణంగా కాదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించాం. అవి ఏమిటో నిర్ధరించే దిశగా దర్యాప్తు జరుగుతోంది. ఇతర కోణాలను కూడా వదిలిపెట్టడంలేదు. ఏదైనా కుట్ర ఉందని తేలితే.. తగిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి మీడియాతో చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 17 మంది అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు.
బుధాల్ గ్రామాన్ని ఇప్పటికే అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇకపై గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ, ప్రైవేటు సమావేశాలు జరపకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. బాధిత కుటుంబాలు, వారి సన్నిహితులు ప్రభుత్వ అధికారులు అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వారి ఇళ్లలో ఉన్న ఇతర పదార్థాలను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బాధిత కుటుంబాల ఇళ్లలోని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 మందితో కూడిన బృందం ఈ మిస్టరీ మరణాలపై దర్యాప్తు చేస్తోంది.
అంటువ్యాధి కాదు..: మిస్టరీ మరణాలపై స్పందించిన కేంద్రమంత్రి
By admin1 Min Read
Previous Articleఅమెరికాలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు: ట్రంప్ వ్యాఖ్యలు
Next Article ఉబర్, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు

