బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’. తాజాగా ముంబయిలో దీని ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. అందులో రష్మిక రిటైర్మెంట్ గురించి సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘‘ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఒక నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అని దర్శకుడితో ఒక సందర్భంలో చెప్పాను. అంత గొప్ప పాత్ర ఇది. షూటింగ్ సమయంలో ఎన్నో సార్లు భావోద్వేగానికి గురయ్యా. ట్రైలర్ చూశాక కూడా ఎమోషనల్ అయ్యా. విక్కీ కౌశల్ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ నన్ను సంప్రదించినప్పుడు ఆశ్చర్యపోయా. ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించా. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశా. టీమ్ అంతా ఎంతో సహకరించింది. ఇందులోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి’’ అని రష్మిక అన్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఛావా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు