చెస్ యువ కెరటం గుకేష్ దొమ్మరాజు తాజా ఫిడే ర్యాంకింగ్స్ లో 2784 రేటింగ్ పాయింట్లతో అత్యుత్తమ భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో భారత్ తరపున మెరుగైన ర్యాంకులో ఉన్న అర్జున్ ఇరిగేశి (2779.5 పాయింట్లు)ని అధిగమించాడు. 2024 సెప్టెంబర్ నుండి అర్జున్ ర్యాంకింగ్స్ లో భారత్ తరఫున మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే ఇటీవల డిసెంబర్లో డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ తాజాగా టాటా స్టీల్ చెస్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇక ఫిడే ర్యాంకింగ్స్ లో నార్వే దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (2832.5) అగ్రస్థానంలో ఉన్నాడు. అమెరికా ప్లేయర్లు హికరు నకముర (2802), ఫాబియానో కరువానా (2798) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు