ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రతిష్టాత్మక గిన్నిస్ రికార్డును సాధించింది. వాంఖడే స్టేడియం 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఎంసీఏ 14,505 రెడ్, వైట్ బాల్స్ తో “ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం” అనే వాక్యాన్ని రూపొందించింది. ఇలా ప్రపంచంలో క్రికెట్ బాల్స్ తో రూపొందించిన పెద్ద సెంటెన్స్ ఇదే. 14505 బంతులతో ఈ వాక్యాన్ని నిర్మించి ముంబయి క్రికెట్ సంఘం గిన్నిస్ రికార్ ఫీట్ సాధించింది. వాంఖడే స్టేడియంలో మొదటి టెస్టు మ్యాచ్ జరిగి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు మాజీ ముంబయి ఆటగాడు ఏక్నాథ్ సోల్కర్ కు అంకితమిస్తున్నాం. ఈ వాక్యాన్ని నిర్మించడానికి ఉపయోగించిన బంతులను పాఠశాల క్రికెటర్లకు, క్లబ్స్, ఎన్టీవోలకు అందజేయనున్నట్లు ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ తెలిపారు. 1975, జనవరి 23 నుండి 29 వరకు భారత్-వెస్టిండీస్ మధ్య వాంఖడేలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. ఈ టెస్టులో సోల్కర్ సెంచరీ సాధించాడు.
Previous Articleఏపీ డిప్యూటీ సీఎంను కలిసిన సింగపూర్ కాన్సుల్ జనరల్
Next Article ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానంలో గుకేష్