కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుండి భారత్ చేరుకున్న ఆయన నేరుగా నేడు ఢిల్లీకి చేరుకున్నారు. నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు ఈసమావేశం జరిగింది.ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి ఆర్థిక సహకారం, వైజాగ్ స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు సహా రాష్ట్రం తరఫున విజ్ఞప్తులను కేంద్ర మంత్రి ముందు ఉంచినట్లు సమాచారం. ఇక అనంతరం సీఎం చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Previous Articleఅటవీ శాఖలో సమూల సంస్కరణలకు నడుం బిగించిన డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్
Next Article బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్ నేత…!