వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024 ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. కాగా ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్ కు కూడా స్థానం దక్కలేదు. గత వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్ నుండి కనీసం ఒక్కరు కూడా ఐసీసీ టీమ్ లో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ కు కెప్టెన్ గా శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంకను ఎంపికయ్యాడు.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024:
చరిత్ అసలంక (కెప్టెన్)- (శ్రీలంక), సయామ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మనుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్థాన్), పథుమ్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్) (శ్రీలంక), షెర్ఫానే రూథర్ ఫర్డ్ (వెస్టిండీస్) అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్) వనిందు హసరంగ (శ్రీలంక) షహీన్ షా అఫ్రిది(పాకిస్థాన్) హరీస్ రవూఫ్ (పాకిస్థాన్) అల్లా మహ్మద్ ఘజన్ ఫర్(ఆఫ్ఘనిస్థాన్).
Previous Articleమూడేళ్లలో అమరావతి నిర్మాణం: మంత్రి నారాయణ
Next Article వారాంతంలో తగ్గిన సూచీలు జోరు..!