ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి టెండర్ల ప్రక్రియను ఈనెలాఖరులోపు పూర్తిచేసి వచ్చే నెల రెండోవారంలో పనులు ప్రారంభించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందని మండిపడ్డారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైనట్లు వివరించారు. రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు.
మొత్తం 40 పనులకు ఇప్పటి వరకు టెండర్లు పిలిచామని వెల్లడించారు. అమరావతిని ప్రపంచంలో టాప్-5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫోస్టర్ చేత చేయించినట్లు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేశారు. తమపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలను ఆపేసిందని ఆక్షేపించారు.
Previous Articleయశ్ చిత్రంలో నయనతార
Next Article వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024 ను ప్రకటించిన ఐసీసీ