రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చూసిన తర్వాత కథానాయకుడు మహేష్ బాబు తనకు ఫోన్ చేసి, ఈ తరహా కథకు మీదైన కామెడీ జోడించి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారని,అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథకు బీజం పడేలా చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘‘వరుణ్ డాక్టర్’ చూసి నాకు భలే అనిపించింది. అందులో చాలా పద్ధతిగా కామెడీ చేశారు.అలాంటి డార్క్ కామెడీని కొంత తీసుకుని, దానికి నాదైన కామెడీ టైమింగ్ జోడించి ఈ కథ రాసుకున్నా. అసలు ఈ ఐడియా ఇచ్చిందే అగ్ర కథానాయకుడు మహేష్ బాబు.ఆయన రజనీకాంత్ ‘జైలర్’ చూసిన తర్వాత నాకు ఫోన్‌చేసి 45 నిమిషాలు మాట్లాడారు. ‘ఇలాంటి ట్విస్ట్‌తో మీరు ఒక సినిమా చేస్తే వండర్స్ క్రియేట్ చేస్తారు’ అని సలహా ఇచ్చారు.ఆయన సలహాతోనే ఈ కథకు బీజం పడింది.ఇంటర్వెల్ తర్వాత హీరోను పోలీస్ ఆఫీసర్‌గా చూపించమని నా టీమ్ మొత్తం చెప్పింది.అలా బాగుండదని నేను ఒక్కడినే పట్టుపట్టా. ‘మన కథలో హీరోయిజం ఉండకూడదు.చిన్నరాజు పాత్రే మొత్తం కనపడాలి’ అని అన్నాను.నా అంచనా నిజమైంది.ఈ చిత్రానికి తప్పకుండా సీక్వెల్ చేస్తా’’ అని అనిల్ రావిపూడి తెలిపారు.