ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా వైభవోపేతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.గంగా,యమున,సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో అందుకు నుగుణంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా మౌని అమావాస్య రోజున ఆ ప్రదేశంలో వీఐపీ జోన్ ఉండదని ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని ప్రభుత్వం తెలిపింది.ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాలను అనుమతించబోమని వెల్లడించింది.ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ ఒక్కరోజే దాదాపు 8 నుంచి 10కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు(అమృత స్నానం) ఆచరించే అవకాశం ఉన్నందున 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్‌ను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ట్రాఫిక్, జనం రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని మోహరించామన్నారు.144ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని అధికారులు పేర్కొంటున్నారు.