కేంద్రం తనకు పద్మభూషణ్ ప్రకటించడం పై నటుడు అజిత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ సమయంలో తన తండ్రి కూడా ఉండి ఉంటే ఎంతో బాగుండేదని అన్నారు.పద్మభూషణ్ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా. సినీ పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. వారం ప్రేరణ, సహకారం, మద్దతు కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా రేసింగ్,
షూటింగ్ నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు. నా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు.ఈరోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదినిపిస్తోంది.నన్ను చూసి ఆయన గర్వపడేవాడు.భౌతికంగా మా మధ్య లేకపోయినా..నేటికి ఆయన నాతోనే ఉన్నాడని అనుకుంటున్నాను.25 ఏళ్ల నుంచి నా భార్య షాలిని సహకారంతోనే ఇలా ఉన్నాను. నా విజయానికి, సంతోషానికి ఆమె ప్రధాన కారణం. చివరగా నా అభిమానుల గురించి చెప్పాలి. మీ అంచంచలమైన ప్రేమ, మద్దతు కారణంగానే నేను అంకితభావంతో
పనిచేయగలుగుతున్నా. ఈ అవార్డు మీ అందరిది మీ అందరికీ వినోదాన్ని అందిచడానికి ఇలానే కష్టపడుతూ ఉంటాను” అని పేర్కొన్నారు.
Previous Articleరెండో టీ20 లో కూడా భారత్ దే గెలుపు: గెలిపించిన తిలక్ వర్మ
Next Article మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం..!