ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
భారత స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో సురక్షితంగా, సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళ… భారత ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047ల లక్ష్యసాధనకు రాజ్యాంగ స్పూర్తితో కృషి చేద్దాం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్:
మన దేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన పర్వదినం జనవరి 26. గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్రంగా మార్గ నిర్దేశనం చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తిని అజరామరంగా వర్ధిల్లేలా చేయడం మనందరి బాధ్యత. మన దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని… రాజ్యాంగ రచన చేసి గణతంత్ర రాజ్యంగా అవతరించడం కోసం జ్ఞాన సంపదను దారపోసిన మేధావుల ఆదర్భాలను ప్రతి ఒక్కరం అందిపుచ్చుకోవాలి.
Previous Articleనా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేది: అజిత్ పోస్ట్
Next Article పద్మ అవార్డ్స్ అందుకున్న సినీ ప్రముఖులు వీళ్లే…!