దేశ ప్రజలు 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది.ఎరుపు,పసుపు కలగలిసిన వర్ణంతో ప్రత్యేకంగా ఉంది.రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ఆయన ‘సఫా’ను ధరించారు. ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు ప్రధాని మోదీ విభిన్నమైన తలపాగాలు ధరించి హాజరవుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన జాగ్రత్త తీసుకొంటారు. 2024 గణతంత్ర వేడుకల్లో కుంకుమ, గులాబీ, తెలుపు, పసుపు రంగులతో కూడినది మోదీ ధరించారు. ఇది గుజరాత్ సంస్కృతికి అద్దంపట్టింది.
Previous Articleఆస్ట్రేలియన్ ఓపెన్-2025 విజేత జన్నిక్ సిన్నర్
Next Article పద్మ భూషణ్ అవార్డుపై స్పందించిన బాలయ్య