తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్తాయిలో నెలకొన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘జన నాయగన్’ అనే టైటిల్ ఖరారు చేసారు, ఈ టైటిల్ పోస్టర్‌లో దళపతి విజయ్ స్టైలిష్‌గా కనిపించారు.
Previous Articleపద్మ భూషణ్ అవార్డుపై స్పందించిన బాలయ్య
Next Article జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి…!