ఫ్రాన్స్ లో జరుగుతున్న ఎలైట్ ఇండోర్ అథ్లెటిక్స్ మీట్ లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజి నేషనల్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించింది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్ ను 8.04 సెకన్లలో ముగించి సత్తా చాటింది. తన పేరిట ఉన్న జాతీయ రికార్డు (8.12 సెకన్లు)ను కొన్ని గంటల వ్యవధిలో జ్యోతి రెండుసార్లు అధిగమించి రికార్డు సృష్టించింది. హీట్స్ లో 8.07 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది . ఫైనల్ రేసును 8.04 సెకన్లలో పూర్తి చేసింది. అయితే మార్చిలో చైనాలోని నానింగ్లో జరిగే ప్రపంచ ఇండోర్ ఛాంపియన్ షిప్స్ అర్హత టైమింగ్ (7.94 సెకన్లు)ను ఆమె అందుకోలేకపోయింది. పురుషుల 60 మీ హర్డిల్స్ లో తేజస్ షిర్సే (7.68 సెకన్లు) కాంస్య పతకం సాధించాడు.
Previous Articleఅండర్-19 టీ20 ప్రపంచ కప్: సూపర్ సిక్స్ లోనూ భారత్ విజయభేరీ
Next Article డ్రా గా ముగించిన గుకేష్