2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి తప్పుడు కధనం పై గత 5 ఏళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఇది నాలుగో వాయిదా. నిజం నా వైపు ఉంది, ఎన్ని సార్లు అయినా కోర్టుకు వస్తాను. ఆలస్యమైనా నిజం తెలుస్తుంది.ఈ రోజు కూడా మంత్రి హోదాలో వచ్చినా, పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుంటున్నా. ప్రభుత్వం నుండి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. వచ్చిన వాహనం, అందులో కొట్టిన డీజిల్ కూడా నా డబ్బుతోనే. ఎక్కడా ప్రభుత్వం పై ఆధారపడకూడదని నా తల్లి నాకు చిన్నప్పట్టి నుంచి నేర్పించిందని లోకేష్ పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. గత ప్రభుత్వ అవినీతిపై ఒక్కొక్కటిగా అన్నీ విచారణ చేస్తామని వివరించారు. దావోస్ పర్యటన పైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదు ? అని ప్రశ్నించారు. కియా కంపెనీని ఎవరు తీసుకొచ్చారో అందరికీ తెలుసని కియా, టీసీఎస్ క్రెడిట్ వాళ్ల అకౌంట్‌లో వేసుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు . అమర్ రాజా కంపెనీని వేధించి తరిమేసారు. జగన్ పాలన వల్ల మూడు ప్రాంతాల ప్రజలూ నష్టపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా అహర్నిశలు కష్టపడతానని తెలిపారు. తనవల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటానని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు