మహారాష్ట్రలో GBS (గిలైన్ బారె సిండ్రోమ్) కలకలం రేపుతోంది. తాజాగా సోలాపుర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దీని వలన మరణించినట్టు అనుమానిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. పుణెలో ఇప్పటివరకు నమోదైన జీబీఎస్ కేసుల సంఖ్య 101కి చేరుకుంది. వారిలో 16 మంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వ్యక్తి కూడా పుణెలోనే చికిత్స పొందినట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని తెలిపారు. బాధితుల్లో 80 శాతం మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తర్వాత ఆరు నెలల్లో స్వతహాగా నడవగలరు. మరికొంతమందికి మాత్రం ఆ సమయం ఏడాది లేక అంతకంటే ఎక్కువ కూడా కావొచ్చు. ఇక ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది. ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఒక్కొక్కటి వేలల్లో ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ప్రభుత్వం రోగులకు ఊరట కలిగించే కీలక ప్రకటన చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉచితంగా జీబీఎస్ చికిత్స అందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు