వారానికి ఎన్ని గంటలు పనిచేయాలనే అంశంపై భారత్ లో భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్లోని 200 కంపెనీలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎటువంటి జీతాల కటింగ్ లేకుండా పూర్తిగా నాలుగు పని దినాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు పలు మార్కెటింగ్, టెక్నాలజీ, ఛారిటీలు సహా 200 సంస్థలు ఈ విధానంలోకి మారినట్లు యూకే మీడియా కథనాలు వెలువడ్డాయి. ‘4 డే వీక్ ఫౌండేషన్’ చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైనట్లు ఆ కథనాలు తెలిపాయి. కాగా, ఈ నిర్ణయంతో ఆయా కంపెనీలలో పని చేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ‘4 డే వీక్ ఫౌండేషన్’ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ “వారానికి ఐదు రోజుల పని దినాలు, 9 నుండి 5 వరకు జాబ్ అనేవి వందేళ్ల కిందటి విధానాలు. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవని మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని వివరించారు. వారానికి 4 రోజుల వర్కింగ్ డేస్ వలన ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది. దానివల్ల వారికి ఫ్యామిలీతో సంతృప్తికర జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛ లభిస్తుందన్నారు.
వారానికి 4 వర్కింగ్ డేస్: బ్రిటన్ లోని 200 కంపెనీలు తాజాగా కీలక నిర్ణయం
By admin1 Min Read