ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా న్యూజిలాండ్ క్రికెటర్ అమీలియా కెర్ ఎంపికైంది. సౌతాఫ్రికా కు చెందిన లారా ఓల్వార్ట్, శ్రీలంకకు చెందిన చమరి ఆటపట్టు, ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సదర్లాండ్లను దాటి ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2024 అవార్డును కైవసం చేసుకుంది. తద్వారా ప్రతిష్టాత్మక రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందుకోనుంది. కాగా 24 ఏళ్ల అమేలియా కెర్ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ గా ఎదిగింది. తన లెగ్ స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే అమేలియా ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది.
ఇక గతేడాది జరిగిన ఐసీసీ మహిళ టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఫైనల్లో కేవలం 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు.. 43 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ టోర్నీలో మొత్తంగా 15 వికెట్లు తీసింది. ఇక మొత్తంగా 2024లో 18 ఇంటర్నేషనల్ టీ20లు ఆడిన అమేలియా కెర్.. 387 పరుగులు చేసింది . 29 వికెట్లు కూడా పడగొట్టింది.
ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా న్యూజిలాండ్ క్రికెటర్ అమీలియా కెర్
By admin1 Min Read