నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జ్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు. జూన్ లోపు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారికంటే ముందు నుండి పార్టీలో పనిచేసిన వారిని గుర్తించి నేతలు ప్రోత్సహించాలని వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. వాటిని బట్టి మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసే విధంగా నామినేటెడ్ పదవులు ఇస్తామని తెలిపారు.
Previous Articleనేటి ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లకు లాభాలు
Next Article నాగ చైతన్య “తండెల్” ట్రైలర్ విడుదల…!