ఉద్దేశపూర్వకంగానే యమునా నదిని హార్యానా ప్రభుత్వం విషపూరితం చేస్తుందంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై నేడు ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రధాని మోడీ స్పందించారు. ప్రధాని తాగే నీటిలో హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా? అని ప్రశ్నించారు. హార్యానా ప్రజలపై ఢిల్లీ మాజీ సీఎం అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఓటమి భారంతో ఆప్ నేతలు ఆందోళన చెందుతున్నారని దుయ్యబట్టారు. హార్యానా ఢిల్లీలలో నివసించే ప్రజలు ఒకరు కాదా అని ప్రశ్నించారు. వారి బంధువులు ఢిల్లీలో ఉండరా తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా? అని ప్రధాని ప్రశ్నించారు. హర్యానా పంపిస్తున్న నీటిని ఢిల్లీలో ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారని అందులో ప్రధాన మంత్రి కూడా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్, ఆప్ పాలనపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు 25 సంవత్సరాలు ఢిల్లీని పాలించాయని అయితే ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ట్రాఫిక్ జామ్స్, నీళ్లు నిలవడం, పొల్యూషన్ ఇలా ప్రతి సమస్యా అలాగే ఉందని మీ ఓటు మాత్రమే వీటి నుంచి విముక్తి కలిగిస్తుందన్నారు.
నేను కూడా ఆ నీళ్లే తాగుతున్నాను: కేజ్రీవాల్ ఆరోపణలపై ప్రధాని మోడీ ఫైర్
By admin1 Min Read