మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు ఘన నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింస ను పరమ ధర్మం గా చెప్పిన మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయం. జాతి పిత కు మరొక్కసారి ఘన నివాళి అర్పిస్తున్నాను.
మంత్రి నారా లోకేష్:
సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మాగాంధీ ఒకరు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు. భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం.
Previous Articleకోహ్లీ కోసం ఎగబడ్డ అభిమానులు …!
Next Article కోహ్లీ రికార్డు దాటిన ఆసీస్ బ్యాటర్ స్మిత్