ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం ఫిబ్రవరి 16న చారిత్రాత్మక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదికగా జరగనుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ వచ్చే నెల 19న ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీని కోసం స్టేడియాలను ఆధునీకరించింది. ఇక వస్తున్న వార్తలను బట్టి షెడ్యూల్ ప్రకారం ఆధునికీకరించిన గడాఫీ స్టేడియాన్ని ఫిబ్రవరి 7న పీసీబీ ప్రారంభించనుంది. దీనికి పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదే నెల 11న కరాచిలో జాతీయ స్టేడియాన్ని ఆరంభిస్తారు. ఆ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశాన్ని ఈ సారి నిర్వహించడం లేదని తెలిసింది. టోర్నీకి ముందు ప్రధాన జట్లు ఇతర మ్యాచ్లతో తీరికలేకుండా ఉండటమే ఇందుకు కారణగా తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు