తమిళ హీరో ధనుష్ నటుడిగా,గాయకుడిగా,పాటల రచయితగా,నిర్మాతగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు.ఆయన దర్శకత్వంలో ఇంతకూ ముందు పా పాండి, రాయన్ చిత్రాలు వచ్చాయి.తాజాగా ధనుష్ దర్శకత్వంలో రానున్న మూడవ సినిమా ‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్’.ఈ సినిమా ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’ పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు.ఈ రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నామని చిత్రబృందం తెలిపింది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘గోల్డెన్ స్పారో..’ సాంగ్ అక్కడి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది.ఈ పాటలో ప్రియాంక మోహన్ లుక్స్, స్టెప్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి.ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ఇందులో పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియాప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయ.