బీహార్‌కి ‘ఫుల్’, ఏపీకి ‘నిల్’. ఇది భారత్ బడ్జెట్ కాదు. బీహార్ ఎన్నికల బడ్జెట్ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆవిడ ఈమేరకు స్పందించారు. NDA భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు ఉన్న బీహార్ సీఎం నితీష్ బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారికి మోడీ గారు చిప్ప చేతిలో పెట్టారని దుయ్యబట్టారు . బీహార్‌ను అందలం ఎక్కించి, ఆంధ్రకు గుండు సున్నా ఇచ్చారని ఆక్షేపించారు . కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు . బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన రుణం తప్పా.. ఇప్పుడు రూపాయి సహాయం లేదు. పోలవరం అంచనాలకు ఆమోదం అన్నారే కానీ బడ్జెట్‌లో ఆశించిన ఫలితం లేదు. విభజన హామీలను తుంగలో తొక్కారని షర్మిల విమర్శించారు. రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఏపీకి ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదని పేర్కొన్నారు. చంద్రబాబు గారి నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న ఉదాసీనత ఈ బడ్జెట్‌తో తేటతెల్లం అయ్యింది. ఇంత అన్యాయం జరిగితే చంద్రబాబు గారు బడ్జెట్‌ను ప్రగతిశీల బడ్జెట్ అని స్వాగతించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు