ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో టికెట్లను కూడా వీటి ద్వారా పొందవచ్చు. వాట్సాప్ లో బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులకు వాట్సాప్ బుకింగ్ కు అవకాశం కల్పించినట్లు తెలిపింది. దీనిపై క్షేత్ర స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల డిపో అధికారులకు, మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. 9552300009 అనే నెంబరు ద్వారా ఏపీ ప్రభుత్వం వివిధ సేవలను అందిస్తోంది.
వాట్సాప్ గవర్నెన్స్: బస్ టికెట్లకు సంబంధించి జిల్లా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు
By admin1 Min Read