నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాస్త్రవేత్తలు 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఇది 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2032 డిసెంబర్ 22న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం కేవలం ఒక్క శాతం మాత్రమేనని, 99 శాతం దాని ప్రభావం భూమిపై ఉండదని వారు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న నాసాకు చెందిన ఆస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ కనుగొంది. అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ (ఐఏసీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ భారీ ఆస్టరాయిడ్ భూమివైపు దూసుకువస్తోందని, దీని పరిమాణం సుమారు ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని భావిస్తున్నారు.
130 – 300 అడుగుల పొడవు గల ఈ గ్రహశకలం మానవాళి మొత్తానికి తక్కువ ప్రమాదకారి అయినా ఒక పెద్ద నగరాన్ని తీవ్రంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కన్నా 500 రెట్లు శక్తివంతమైనది అయి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
Previous Articleఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు
Next Article మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ విజేత భారత్