సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో సుమారు రెండు గంటల పాటు మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈమేరకు ఆమోదం తెలిపిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.దేశంలోనే మొదటిసారిగా కులగణన చేపట్టిన రాష్ట్రంగా నిలచిందని పకడ్బందీగా సర్వే నిర్వహించి సమాచారం సేకరించినట్లు వివరించారు .కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేస్తుందని పేర్కొన్నారు. కులగణనపై ప్రధానమంత్రిపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం : సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు ఆమోదం
By admin1 Min Read