పనామా కెనాల్ అంశంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పంతమే నెగ్గింది. పనామా కెనాల్ లో అమెరికా షిప్ లు ఫ్రీగా ప్రయాణించే విధంగా ఈమేరకు అమెరికా డిఫెన్స్ మినిస్టర్ హెగ్సే , పనామా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అలెక్స్ మధ్య ఒప్పందం కుదిరింది. తాజాగా జరిగిన ఒప్పందం ప్రకారం అమెరికా గవర్నమెంట్ షిప్ లకు భారీగా నగదు మిగిలిపోతుందని తెలిపారు. ఈ కెనాల్ లో అమెరికా షిప్ లు ఇంకా ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. గతేడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ పనామా కెనాల్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కెనాల్ ను 1914లో నిర్మించింది. దీనిని మొదట అమెరికానే నిర్వహించింది.అయితే, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తి ఆందోళనలతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ కెనాల్ ను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కెనాల్ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కెనాల్ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది.
Previous Articleబంగ్లాదేశ్ లో ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసానికి నిప్పు
Next Article రామ్ చరణ్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన ప్రత్యేక అతిధి…!