మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా “RC16” చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్పాట్ లో ఓ ప్రత్యేక అతిథి సందడి చేసింది.ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుంది. రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ నేడు హైదరాబాద్‌లో జరిగింది.
అయితే రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారతో చిత్రీకరణ ప్రదేశంలో కనిపించారు.లొకేషన్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.షూటింగ్ స్పాట్ లో తన కుమార్తె చేయి చాచి ఏదో చూపిస్తుండగా రామ్ చరణ్ ఆమెను చూస్తూ ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.